22 June, 2026 | 2:37 PM

Breaking News

డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •  

రాతిలో సంగీతం.. స్తంభాల్లో ప్రతి ధ్వని

03-02-2026 08:46 PM

ఇండియన్ ఆడిట్, అకౌంట్స్ సర్వీస్ అధికారి అఖిల్

వెంకటాపూర్,(విజయక్రాంతి): మండలంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అధికారి అఖిల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి కుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ అద్భుత శిల్పకళా సౌందర్యాన్ని ఆయన ఆసక్తిగా తిలకించారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ శైలి, శిల్పాల నైపుణ్యం, దేవాలయ గర్భగృహం, స్తంభాలపై చెక్కిన సున్నితమైన శిల్పాలు, నర్తకీ మణులు, శబ్ద స్తంభాలు వంటి విశేషాలను టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేష్ విపులంగా వివరించారు. రామప్ప దేవాలయం ఎందుకు ప్రపంచ ఖ్యాతిని పొందిందో, కాకతీయుల వాస్తు శాస్త్ర ప్రతిభ ఏ స్థాయిలో ఉందో తన వివరణ ద్వారా తెలియజేశారు. పర్యటన మొత్తం సమయంలో టూరిస్టు పోలీసులు అరుణ్ కుమార్, శ్రీనివాస్ భద్రతా ఏర్పాట్లతో పాటు పర్యాటక నిర్వహణను సమర్థవంతంగా పర్యవేక్షించారు. రామప్ప దేవాలయాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన అఖిల్, ఆలయ శిల్పకళ అద్భుతమని, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ఇది ప్రతీకగా నిలుస్తుందని ప్రశంసలు వ్యక్తం చేశారు.