22 June, 2026 | 2:31 PM

Breaking News

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •  

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!

22-06-2026 01:25 PM

మంత్రి రాకతో అప్రమత్తం. 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాల(Government school) తరగతి గదిలో ఆ విద్యార్థులకు బోధించేందుకు హాజరవుతున్న ఉపాధ్యాయులు వారి వాహనాలను తరగదులు, వంట గదుల్లో భద్రపరుస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఏర్పడింది. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ ప్రభుత్వ పాఠశాలలో ఆయా తరగతి గదుల్లోకి తమ వాహనాలను తీసుకొచ్చి పార్కింగ్ చేసుకున్నారు. సోమవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) పర్యటన నేపథ్యంలో విద్యార్థులతో అ వాహనాలను బయటకు తీయించడం అక్కడ ఉన్న జర్నలిస్టులను ఆశ్చర్య పరిచింది.