30 April, 2026 | 6:54 PM

ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు అండగా ఉంటా

30-04-2026 04:55 PM

పార్టీ కార్యకర్తలను కలుపుకొని బిఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడమే నా లక్ష్యం: పిల్లుట్ల రఘు

గరిడేపల్లి ఏప్రిల్ 30,(విజయ క్రాంతి): ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని బిఆర్ఎస్ నాయకులు పిల్లుట్ల రఘు అన్నారు.మండల పరిధిలోని కీతవారిగూడెం గ్రామానికి చెందిన తేలబాటి సైదులు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది.కాగా గురువారం సైదులు కుటుంబ సభ్యులను రఘు పరామర్శించి పదివేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సహకారంతో బిఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉండాలని తెలిపారు.నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బిఆర్ఎస్ కార్యకర్తలను కలుపుకొని బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడమే తన లక్ష్యం అన్నారు.బిఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.కార్యక్రమంలో సర్పంచ్ బొల్లేపల్లి రామనాథం గౌడ్,పోలంపల్లి ఆనంద్ బాబు, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.