26 May, 2026 | 5:30 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

సెకండాఫ్‌లో ఆడతా

27-03-2026 02:08 AM

ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఆసీస్ పేసర్

బెంగళూరు, మార్చి 26 : ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ హై దరాబాద్ సిద్ధమవుతోంది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా బెంగళూరులో జట్టు తో కలిసాడు. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టా డు. అయితే కమిన్స్ ఫస్టాఫ్ మ్యాచ్‌లు ఆడే అవకాశాలు లేనట్టే. తన గాయం, రికవరీకి సంబంధించి కమిన్స్ స్వయంగా అప్‌డేట్ ఇచ్చాడు. ప్రస్తుతానికైతే తాను పూర్తిగా కోలుకోలేదని, అయితే తన రికవరీలో అద్భుతం గా ప్రోగ్రెస్ ఉందని తెలిపాడు.

ఒక ప్రణాళిక ప్రకారం బౌలింగ్ ప్రాక్టీస్ కూడా ప్రారంభించినట్లు చెప్పాడు. రికవరీ ప్రాసెస్‌లో జాగ్ర త్తగా వ్యవహరిస్తున్నాననీ, అందుకే ప్రతి మూడు రోజులకోసారి నెట్స్‌లో బౌలింగ్ సాధన చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. టోర్నమెంట్ సెకండాఫ్ నాటికి పూర్తిగా కోలుకు నేలాగా ప్లాన్ చేసుకున్నట్టు వివరించాడు. అంతా సవ్యంగా జరిగితే, తాను టోర్నమెం ట్ సెకండ్ హాఫ్‌తోపాటు ఫైనల్స్ కూడా ఆడతానని కమ్మిన్స్ వెల్లడించాడు. ఇదిలా ఉంటే కమిన్స్ గైర్హాజరీలో సన్‌రైజర్స్ జట్టుకు ఇషా న్ కిషన్ సారథిగా వ్యవహరించనున్నాడు.