31 May, 2026 | 3:00 AM

హాయ్ బాయ్ వద్దనడం ఆశ్చర్యమేసింది!

31-05-2026 01:42 AM

యశ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అనుభవాలను హీరోయిన్ కి యారా అద్వా నీ ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఇటీవల  “టాక్సిక్’ డైరెక్టర్ గీతూ మో హన్దాస్ సెట్‌లో తనకు ఓ కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారని కియార చెప్పుకొచ్చింది. “సెట్‌కు రాగానే అందరికీ ‘హాయ్, హలో, గుడ్ మార్నింగ్’ అని చెప్పడం నాకు అలవాటు. కానీ డైరెక్టర్ దాన్ని ఆపమన్నారు.

‘రేపు సెట్‌కు వచ్చినప్పుడు నువ్వు క్యారెక్టర్‌లోనే ఉండాలి. ఈ హాయ్, హలో లాంటి ఫార్మాలిటీస్ ఏవీ వద్దు. నేరుగా నీ పాత్రలోకి వెళ్లిపోవాలి’ అని గీతూ చెప్పారు. ఆమెకు ఉన్న నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయా” అని పేర్కొంది కియారా. ఆమె ఇంకా మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించడం చాలా సవాలుగా అనిపించిందని చెప్పింది.

“టాక్సిక్’ షూటింగ్ చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే, ఒకే సీన్‌ను ఇంగ్లీష్, కన్నడ భాషల్లో చిత్రీకరించాం. పర్‌ఫెక్ట్ టేక్ వచ్చే వరకు ముందు ఇంగ్లీష్‌లో రిహార్సల్ చేసి, ఆ తర్వాత అదే సీన్‌ను కన్నడలో షూట్ చేసేవాళ్లం. కన్నడ నాకు కొత్త భాష కాబట్టి, ముందు రోజు రాత్రే డైలాగ్స్ అన్నీ బట్టీ పట్టాల్సి వచ్చేది” అని తెలిపింది కియారా.