16 March, 2026 | 3:26 AM

నాకు మీ ఆశీర్వాదం కావాలి

16-03-2026 01:39 AM
  1. మైనార్టీలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది 
  2. తెలంగాణను దేశంలోనే అభివృద్ధివైపు నడిపిద్దాం 
  3. ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి15 (విజయక్రాంతి): ‘నేను మీ సోదరుడిని.. నాకు మీ ఆశీర్వాదం కావాలి. మా ప్రభుత్వం మైనార్టీలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది’ అని ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమంలో మైనార్టీలకు సింహభాగం ఇచ్చి, అభివృద్ధి వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నామని సీ ఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రంజాన్ పవిత్ర మాసం సమాజంలో సఖ్య త, సోదరభావం పరిఢవిల్లాలి అని ఆకాంక్షించారు.

‘ఈ ప్రభుత్వం మీది, నేను మీ సోద రుడిని మనమంతా కలిసి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్దాం. మీ అందరి ఆశీర్వాదం ఈ ప్రభుత్వా నికి అవసరం’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నా రు.  మైనార్టీల సంక్షేమం, 4 శాతం రిజర్వేషన్లపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ వందలాది మంది మైనార్టీ యువతీ యువకులకు విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తు న్నాయంటే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు తీసుకువచ్చిన 4 శాతం రిజర్వేషన్లే కారణం అని సీఎం అన్నారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ద్వారా ప్రభుత్వం సహకరిస్తోందన్నారు.

‘ప్రపంచంలో యుద్ధ పరిస్థితులు చూస్తున్నాం. భారత్‌లోని మన మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తారు. ఆ మాయ లో మనం పడవద్దు. అందరం కలిసి తెలంగాణను దేశంలోనే అభివృద్ధి పథం వైపు నడిపే ప్రయత్నం చేద్దాం. మైనార్టీల కోసం ఈ ప్రభుత్వం ఎంతవరకు అండగా ఉండా లో అంతవరకు అండగా ఉంటాం. మైనార్టీ నేత అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నామని, మైనార్టీలకు 4 శాతం రిజర్వేష న్లు అమలు చేయడంలో కీలకపాత్ర పోషించిన షబ్బీర్‌అలీనీ ప్రభుత్వ సలహాదారుగా, 8 మంది మైనార్టీలను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించుకున్నాం.

క్రికెటర్ సిరాజ్‌కు డీఎస్సీ ఉద్యోగం, నిక్కత్ జరీన్‌క్‌కు రూ.2 కోట్లు ఇచ్చి గౌరవించుకున్నాం. పభు త్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో మైనార్టీకి సింహభాగం ఇస్తున్నాం. అంతా కలిసిమెలిసి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి విరించారు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, వారిపట్ల మనందరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఇఫ్తార్ విందులో ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తది తరులు  పాల్గొన్నారు.