28 June, 2026 | 1:50 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

బాచుపల్లి విల్లాల్లో హైడ్రా యాక్షన్.. హెచ్‌ఆర్సీ సీరియస్

14-03-2026 01:03 AM
  1. నివాసితులపై సోషల్ మీడియా ట్రోలింగ్‌ను అరికట్టండి.. డీజీపీకి కమిషన్ ఆదేశం

ఆర్టికల్ 21 ప్రకారం ప్రశాంత జీవన హక్కు ఉల్లంఘనే .. జస్టిస్ షమీమ్ అక్తర్

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 13 (విజయక్రాంతి): మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలోని ఏపీఆర్ ప్రణవ్ ఆంటిలియా విల్లాస్‌లో ఇటీవల హైడ్రా చేపట్టిన కూల్చివేతల వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. కూల్చివేతల సమయంలో అధికారుల తీరు, ఆ తర్వాత సోషల్ మీడియాలో నివాసితులపై జరుగుతున్న వ్యక్తిత్వ హననంపై కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నివాసితుల ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ ఇది రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 కల్పించిన జీవన హక్కు, గౌరవం, గోప్యతను ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీతో పాటు జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ నెల 9న బచుపల్లిలోని సదరు విల్లా సముదాయంలో హైడ్రా అధికారులు ఆకస్మికంగా దాడులు చేసి కంపౌండ్ గోడను కూల్చివేశారు.

బాధితుల కథనం ప్రకారం.. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా, వివరణ కోరకుండా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముఖ్యంగా విల్లాలో ని జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సమయం కోరిన మహిళా నివాసి తులను అధికారులు పక్కకు నెట్టివేస్తూ అమర్యాదగా ప్రవర్తించారని కమిషన్ దృష్టికి వచ్చింది. అధికారుల తీరు మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని కమిషన్ ప్రాథమికంగా నిర్ధారించింది.

ట్రోలింగ్‌పై ఉక్కుపాదం 

కూల్చివేతల అనంతరం కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్లలో నివాసితులపై, ముఖ్యంగా మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు, ట్రోలింగ్ జరుగుతుం డటంపై కమిషన్ సీరియస్ అయింది.  సోష ల్ మీడియాలో అపవాదు ప్రచారాన్ని, ట్రోలింగ్‌ను తక్షణమే అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీకి సిఫారసు చేసింది. ఈ వ్యవహారంపై సంబంధిత విభాగాల అధికారులు పూర్తినివేదికలను కమిషన్‌కు ఇవ్వా లని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది.