28 June, 2026 | 2:54 PM

Breaking News

ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •  

సీసీ టీవీ నిఘాలో ఇంటర్ పరీక్షలు

16-02-2026 02:08 AM

పరీక్షా కేంద్రాల్లో వాల్ క్లాక్ ఉండాల్సిందే

పకడ్బందీగా బోర్డు అధికారుల చర్యలు 

ఈ నెల 25 నుంచి పరీక్షలు

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణపై ఇంటర్ బోర్డు అన్ని ఏర్పా ట్లు, జాగ్రత్తలు తీసుకుంటుంది. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ టీవీ పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష రాసే వి ద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా కాలేజీ యామజాన్యాలు, సంబంధిత అధికారులకు ఇంటర్ బోర్డు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

ప్రతి కేం ద్రంలోని ప్రతి హాల్‌లో గోడ గడియారం ఏర్పాటు చేయాలని బోర్డు అధికారులు సూ చించారు. ఫ్యాన్లు, సరైన గాలి ప్రసరణ ఉం డాలి, మరుగుదొడ్లు ఉండాలి, తాగు నీరు సదుపాయం, విద్యార్థులను నేలపై కూర్చోబెట్టకుండా పరీక్ష రాసేందుకు డ్యూయల్ డెస్క్‌లు ఏర్పాటు చేసేలా డీఐఈవోలు పర్యవేక్షించనున్నారు. ప్రశ్నపత్రాల భద్రతా ఏర్పా ట్లు, పారదర్శకంగా, ఎలాంటి అంతరాయం లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని బోర్డు సూచించింది.