రైతులను ముంచుడే కాంగ్రెస్ ధ్యేయం
- కల్లాల్లో రైతులు అరిగోస పడుతున్నారు
- రైతులకు అండగా నిలిచింది బీఆర్‌ఎస్సే
- మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
- బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
- ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
- అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన బీఆర్‌ఎస్ నేతలు
ఖమ్మం, ఏప్రిల్ 24(విజయక్రాంతి): రైతులను నట్టేట ముంచడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని, కొనుగోలు కేంద్రాలను ఎక్కువ ఏర్పాటు చేసి ధాన్యం, మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ రావు ఆధ్వర్యం లో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్‌లో ధర్నా చేపట్టారు.
అనంతరం ర్యాలీగా కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు బీఆర్‌ఎస్ నాయకులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరి గి ఉద్రిక్తంగా మారింది. బీఆర్‌ఎస్ నేతలు గేట్లను నెట్టుకుని కలెక్టర్ కార్యాలయంలోకి దూసుకెళ్లి అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ రైతులు మొక్కజొన్నను కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో పోసి నెలల తరబడి తూఖాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.
మొక్కజొన్నలను కొనుగోలు చేసే నాథుడే లేడని, బస్తాలు ఇచ్చే వారే కరువయ్యారని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేయాలని, వరికి మద్దతు ధర ఇవ్వాలని, రైతులు పండించిన అన్ని పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్సీ తాతామధు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు పండించిన ప్రతి గింజ ను కొనుగోలు చేశామని,కానీ ఇప్పుడు రైతులు అరిగోస పడుతున్నారని అన్నారు.
ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ వండి వార్చి నా వడ్డించడం చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలి.. రైతుల సమస్యలు పరిష్కారం కావాలని అన్నారు. రేవంత్ రెడ్డి అసమర్ధ పాలన వల్లే రాష్ట్రంలో ఈ అరిష్టాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ మనిషిని మనిషి ము ట్టుకునే పరిస్థితి లేని కరోనాలో కూడా ప్రతి గింజ కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్‌ది అని కొనియాడారు.
షాపుల్లో లేని యూరి యా యాప్‌ల్లో ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించింద న్నారు. పార్టీలు మార డం తప్ప తుమ్మలకు ఏం అనుభవం ఉందన్నారు.ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర రైతులు మంటలు మండిస్తున్నారని.. రైతు లు ఎదురుదిరిగితే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు.. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారు ఇప్పుడు కళ్లకు కట్టినట్టు కనబడుతుందన్నారు.
మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో స్వర్ణ యుగం రావాలంటే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నారు. కమీషన్లు, పర్సంటేజ్‌లు, భూముల మీదనే మంత్రులకు ఉత్సా హం ఉందని, రైతు సమస్యల మీద మంత్రులకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు అని దుయ్యబట్టారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, మాజీ చైర్మన్లు కూరాకుల నాఘభూషణం,ఆర్జేసీ కృష్ణ, బచ్చు విజయ్ కుమార్, ఖమర్, నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, మండల అధ్యక్షులు అజ్మీరా వీరు నాయక్ నాయకులు, కార్యకర్త లు పాల్గొన్నారు.






