21 August, 2026 | 2:07 AM

‘తుర్కయంజాల్’లో స్వీపింగ్ మెషిన్ మాయం

21-08-2026 12:09 AM

ప్రజాధనం దుర్వినియోగంపై బీజేపీ ధర్నా

ఆదిభట్ల, ఆగస్టు 20 (విజయక్రాంతి): తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో రూ.71 లక్షల ప్రజాధనంతో కొనుగోలు చేసినట్లు చెప్తున్న రోడ్ల స్వీపింగ్ మెషిన్ క నిపించకపోవడంపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ 53, 56 డివిజన్ల అధ్యక్షుడు ఎలిమినేటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఆదిభట్ల సర్కిల్ ప రిధిలోని రాగన్నగూడ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు.కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు రాజు భూపాల్గౌడ్, సీనియర్ నాయకులు నారాయణ యాదవ్, నోముల దయానంద్గౌడ్ హాజరై మాట్లాడారు.

అధికారిక రికార్డుల్లో రూ.71 లక్షలతో స్వీపింగ్ మెషిన్ కొనుగోలు చేసినట్లు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అది ఏ రోడ్డుపైనా కనిపించడం లేదని ఆరోపించారు.మెషిన్ ఎప్పుడు కొనుగోలు చేశారు? ఎక్కడ వినియోగిస్తున్నారు? దానికి సంబంధించిన బి ల్లులు, చెల్లింపుల వివరాలను బహిర్గతం చేయాలన్నారు. అవకతవకలు తేలితే బాధ్యులపై కేసులు నమోదు చేయాలని కోరారు.  స్పష్టమైన లెక్క తేలే వరకు పోరాటం కొనసాగిస్తామని, సమాధానం రాకపోతే ఆందో ళనల తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.