ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
21-08-2026 01:22 AM
తాడ్వాయి, ఆగష్టు 20 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడు గ్రామంలో గురువారం రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాడువాయి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గైని రాజలింగం, వర్కింగ్ ప్రెసిడెంట్ బద్దం మల్లేష్ రెడ్డి, విడిసి అధ్యక్షులు మోహన్ రెడ్డి, నాయకులు శివరాజు, జనార్దన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, హనుమంత్ రెడ్డి,మైఫా గౌడ్, నారాయణ పాల్గొన్నారు.






