తిప్పారం గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
గాంధారి, ఆగస్టు 20 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారం గ్రామంలో రూ.10 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని స్థానిక సర్పంచ్ ప్రమోద మాధవరావ్ ప్రారంబించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రమోద మాధవరావ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ ను తమ గ్రామ అభివృద్ధికి, మౌలిక వసతుల కొరకు నిధులు కోరగా తక్షణమే స్పందించి రూ.10 లక్షల నిధులు మంజూరు చేశారని, ఇంకో రూ.5 లక్షల రూపాయలు త్వరలోనే మంజూరు చేయనున్నారని అన్నారు..
ఎమ్మెల్యే చొరవతో నేడు గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించామని , గ్రామంలో మిగతా సమస్యలగురించి ఎమ్మెల్యే కు విన్నవించి త్వరలోనే పరిష్కరిస్తామని ఆమె తెలిపారు.. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు.. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రవణ్, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్ రావు, కాంగ్రెస్ నాయకులు బిషన్ నాయక్, మాధవరావు, పంచాయతీ రాజ్ ఏఈ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు..






