15 June, 2026 | 2:40 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

ముంబై ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా గంజాయి పట్టివేత

26-11-2025 10:21 AM

ముంబై: ముంబై ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. ఛత్రపతి మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 39 కేజీల విదేశీ గంజాయిని సీజ్ చేశారు. ఎయిర్ పోర్టులో అనుమానంగా కనిపించిన గంజాయి ముఠాను గుర్తించి అధికారులు తనిఖీ చేశారు.  ఎవరికి అనుమానం రాకుండా స్మగ్లింగ్ గంజాయిని చాక్లెట్ల రూపంలో బ్యాంకాక్ నుంచి ముంబైకి తరలించారు. దీని విలువ సుమారుగా రూ.39 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.  స్మగ్లింగ్ ఎత్తును పసిగట్టిన కస్టమ్స్ అధికారులు వారి గుట్టురట్టు చేశారు. ఈ మేరకు అధికారులు 8 మంది అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రధాన సూత్రధారులను గుర్తించే పనిలో ఉన్నారు.