13 May, 2026 | 11:41 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

మియాపూర్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

07-10-2025 06:07 PM

హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే తాజా మియాపూర్‌లో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. మన్ని రామ్ అనే వ్యక్తి రాజస్థాన్‌ నుండి హైదరాబాద్‌కి వచ్చాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకొని తనీఖీ చేసి విచారించగా గసగసాలు స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు తెలిసింది. స్మగ్లర్ నుంచి 4.25 కిలోల గసగసాలను స్వధీనం చేసుకొన్నారు. నిందితుడు కార్పెంటర్‌గా పని చేస్తూ డ్రగ్స్‌ దందాకు తెరలేపిన్నట్లు పోలీసుల విచారణలో తెలింది. ఈ మేరకు గసగసాల స్మగ్లర్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.