24 March, 2026 | 8:03 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

బాన్సువాడలో స్కూటీలో నుంచి భారీ నగదు చోరీ..

08-10-2025 04:42 PM

బాన్సువాడ (విజయక్రాంతి): స్కూటీలో నుంచి సినీ పక్కిలో భారీ నగదు చోరీ జరిగిన సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో చోటుచేసుకుంది. బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్ గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే మహిళ బ్యాంకులో బంగారం కుదువపెట్టి తెచ్చిన రూ.లక్షన్నర నగదును స్కూటీ డిక్కీలో డబ్బులు డిక్కీలో పెట్టి వసతి గృహంలో పనిచేసేందుకు వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి స్కూటీ డిక్కీలో డబ్బులు కనిపించలేదు. అప్పటికే లక్షన్నర నగదును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఆందోళన చెందిన బాధితురాలు రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.