21-02-2026 12:26:20 AM
కందుకూరు, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి సుమారు 10.61 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కె. సీతారాం వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. కందుకూరు మండల కేంద్రానికి సమీపంలోని నేదునూరు గేట్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది. దీనితో సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. పంచుల సమక్షంలో విచారణ జరిపి, నిందితుల వద్ద ఉన్న గంజాయితో పాటు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వ్యక్తులు ఏపీ కి చెందిన వారిగా గుర్తించారు.
మల్లిశెట్టి దుర్గా, మల్లికార్జున రాజు ల ది.కాకినాడ జిల్లా, జగ్గంపేట మండలం, కృష్ణాపురం నివాసి. ప్రస్తుతం హైదరాబాద్లోని కేపీహెచ్బీలో ఉంటున్నాడు. రామావత్ మోద మహేష్ ది విశాఖపట్నం జిల్లా, వి.మాడుగుల నివాసి. ఇతను కూడా కేపీహెచ్బీ ప్రాంతంలోనే నివసిస్తున్నాడని .ఈ కేసులో వీరికి గంజాయి సరఫరా చేసిన శాంతి అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.