calender_icon.png 21 February, 2026 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఆర్పీలో భారీగా చేరికలు

21-02-2026 01:51:45 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్జి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శుక్ర వారం పలువురు మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో టీఆర్పీలో చేరారు. మల్లన్న పార్టీ కండువా కప్పి కొత్త సభ్యులను పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం పార్టీ లో చేరిన నాయకులు మాట్లాడుతూ.. ఇంతకాలం ఇతర పార్టీలలో పనిచేశామని, ఇప్పు డు బీసీల హక్కుల కోసం పోరాడే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షి తులై చేరుతున్నామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో గ్రామ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసి విస్తరించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. పార్టీలో చేరిన వారిలో ఉడుముల ఐలయ్య, కొండ వెం కన్న, పులుగుజ్జు రామ్ మూర్తి, రాజు తదితరులు ఉన్నారు.