25 April, 2026 | 2:00 AM

గర్భాశయ క్యాన్సర్ నిరోధించడానికే హెచ్.పి.వి వ్యాక్సినేషన్

25-04-2026 12:47 AM

తాడ్వాయి,ఏప్రిల్, 24( విజయ క్రాంతి ): గర్భాశయ క్యాన్సర్ నిరోధించడానికే హెచ్ పి వి వాక్సినేషన్ తీసుకోవాలని డిఎం అండ్ హెచ్ ఓ రవీందర్ గౌడ్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాల వయసు లోపల ఉన్న ప్రతి ఆడపిల్ల హెచ్ పి వి వ్యాక్సినేషన్ తీసుకోవాలని సూచించారు.

ఈ వ్యాక్సినేషన్ తీసుకున్నట్లయితే గర్భాశయ క్యాన్సర్ రాకుండా నిరోధించబడుతుందని తెలిపారు. అందుకోసం ప్రతి ఒక్కరు ఈ వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించాలని కోరారు. సర్పంచులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఈ వ్యాక్సినేషన్ పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.ఈ సందర్భంగా ఆడపిల్లలకు వ్యాక్సినేషన్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సొంటికె మల్లవ్వ, ఉపసర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, వైద్యాధికారి కాసిం, హెచ్‌ఈఓ నారాయణ, పి హెచ్ ఎన్ నక్షత్రం,హెల్త్ సూపర్ వైజర్ మణెమ్మ, సిబ్బంది సరస్వతి, శ్రీనివాస్, స్వాతి, సుమలత, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.