వడదెబ్బ తగిలి మహిళ మృతి
25-05-2026 04:02 PM
దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని చలనప్పగూడెం గ్రామానికి చెందిన బండారు నాగమణి( 40) మూడు రోజుల క్రితం పామాయిల్ తోట కాలిపోగా ఆదివారం భర్త కొర్రాజులు తో కలిసి ఆమె తోటకు వెళ్లి నీళ్లు పెట్టి తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి రాగా, ఆమెకు ఎండ దెబ్బ తగిలి కండ్లు తిరిగి వాంతులు అవడంతో సత్తుపల్లి హాస్పిటల్ కి తీసుకొని వెళుతుండగా మార్గమధ్యంలో చనిపోయినది. భర్త కొర్రాజులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దమ్మపేట ఎస్ ఐ బి రాజేష్ కుమార్ తెలిపారు.






