గ్రామాల్లో ఇంటి పన్ను 100% వసూలు చేయాలి
22-04-2026 06:44 PM
ఖానాపూర్ ఎంపీడీవో రాధా రాథోడ్
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లో ఇంటి పన్ను 100% వసూలు చేయాలని ఎంపీడీవో రాదా రాథోడ్ గ్రామపంచాయతీ సిబ్బందికి సూచించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో సెక్రటరీలు ఇజిఎస్, ఐకేపీ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రత సక్రమంగా నిర్వహించాలని ,ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు, సగ్రిగేషన్ షెడ్లు, నర్సరీలు సక్రమంగా నిర్వహించి, ఉపాధి కూలీలకు ప్రతిరోజు పనిని కేటాయించి హాజరు సరిగా నమోదు చేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఎం పి ఓ సి. హెచ్ రత్నాకర్ రావు, ఐకెపి, ఈజీఎస్, సిబ్బంది రమేష్ ,మల్లేష్ ,పంచాయతీల సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.






