8 April, 2026 | 12:18 AM

అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

07-04-2026 10:00 PM

సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి

చిట్యాల,(విజయక్రాంతి): ​అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే ఆందోళనలు చేపడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం చిట్యాల మండల పరిధిలో వెలిమినేడులో జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రధాని మోడీ యుద్ధ నివారణ చర్యలు చేపట్టకుండా అమెరికాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అంతర్జాతీయ యుద్ధాల నెపంతో నిత్యావసరాలు, గ్యాస్ ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు.  కేరళ ఆదర్శ పాలనను విమర్శించే ముందు, సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.