అనురాగ్‌లో బిజ్హ్యాక్ 2026 నిర్వహణ
ఘట్ కేసర్, మార్చి 20 (విజయకాంతి) : అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ‘బిజ్హ్యాక్ 2026‘ బిజినెస్ హ్యాకథాన్ యూనివర్సిటీ క్యాంపస్లో నిర్వహించారు. హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎ. దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత వ్యాపార వాతావరణం బ్రిటిల్, ఆందోళనకర, నాన్-లీనియర్, అర్థంకాని స్వరూపంలో ఉందని వివరించారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి నూతన ఆవిష్కరణల అవసరం ఉందని ఆయన సూచించారు. విభాగాధిపతిడాక్టర్ వి. విష్ణువందన మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు మేనేజ్మెంట్ విద్యార్థుల్లో సృజనాత్మక సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తాయని తెలిపారు.
ఈహ్యాకథాన్లో పాల్గొన్న బృందాలకు ఆరోగ్యం, రిటైల్, ఎనర్జీ, ఐటీ వంటి విభిన్న రంగాలకు సంబంధించిన వ్యాపార కేసులు ఇవ్వబడగా, వాటికి వాస్తవిక పరిష్కారాలను రూపొందించి ప్రజెంట్ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్లోని 15 కళాశాలల నుండి మొత్తం 48 బృందాలు ఈ పోటీలో పాల్గొన్నాయి. బిజ్హ్యాక్ 2026 విజేతలుగా అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ రణీష్, మన్జీత్, ప్రియాంశు, మనోజ్ మొదటి బహుమతి సాధించగా, అనురాగ్ యూనివర్సిటీ సాయి సృజిత, వైష్ణవి రెండో బహుమతి గెలుచుకుంది. లోయోలా అకాడమీ అనిల్, శ్రీవల్లి బృందం మూడో స్థానాన్ని దక్కించుకుంది.




