21 May, 2026 | 5:30 PM

సానిటేషన్ పై శ్రద్ధ చూపాలి

21-05-2026 04:24 PM

 ఖానాపూర్ ఎంపీడీవో రాధా రాథోడ్,

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు విధిగా శానిటేషన్ పై శ్రద్ధ చూపాలని ఖానాపూర్ ఎంపీడీవో రాధా రాథోడ్ అన్నారు. గురువారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో శానిటేషన్, సెక్రికేషన్ నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రగతి, నర్సరీల నిర్వహణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సిహెచ్ రత్నాకర్ రావు, పంచాయతీ కార్యదర్శిలు పలువురు ఉన్నారు.