21 May, 2026 | 5:30 PM

ధర్మారెడ్డి గ్రామంలో బడిబాట కార్యక్రమం

21-05-2026 04:30 PM

ప్రైవేట్ పాఠశాలలు వద్దు-ప్రభుత్వ పాఠశాలలు ముద్దు

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పిల్లలతో "ప్రైవేటు పాఠశాల వద్దు- ప్రభుత్వ పాఠశాల ముద్దు" అనే నినాదాలతో గ్రామంలో తిరుగుతూ ప్రవేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లల ఇంటి వద్దకు వెళ్లి పిల్లల తల్లిదండ్రులకు ఎంపీఓ ప్రభాకర్ చారి,గ్రామ సర్పంచ్ గుల్లపల్లి లక్ష్మీనారాయణ అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎంపిఓ ప్రభాకర్ చారి గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ...కుటుంబ ఖర్చుల భారం గురించి వివరించి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుకుంటే మీయొక్క పిల్లలకు సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్ లు,ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నం భోజనం,సన్న బియ్యం,వారానికి మూడుసార్లు గుడ్లు మరియు పై చదువుల గురించి తెలియజేయడం జరిగింది.కుటుంబం భారం తగ్గాలంటే ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించండని తెలిపారు.ప్రైవేట్ పాఠశాలలు చదువుకుంటే కుటుంబం భారం పెరుగుతుందని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే కుటుంబ భారం తగ్గుతుందనిపై ఉద్యోగాలు గుర్తిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి లక్ష్మీనారాయణ,ఉప సర్పంచ్ జయరాజ్,ఎంపీఓ ప్రభాకర్ చారి,కార్యదర్శి రమేష్, ఉపాధ్యాయులు జ్యోతి, ప్రతిభ, వార్డు మెంబర్లు సిద్ధవ్వ,సాయిబాబా,లాలు తదితరులు పాల్గొన్నారు.