సింగరేణి ఆద్వర్యం లో ఉచిత వైద్య శిబిరం
కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో ,వి కే సీఎం ప్రాజెక్టు ప్రభావిత , పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా పెనగడప గ్రామ పంచాయతీ కార్యాలయం లో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ వైద్య శిబిరంలో వైద్య నిపుణులు గ్రామ ప్రజలకు, రక్తపోటు (బిపి), మధుమేహం (షుగర్) వంటి వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత మందులు అందజేశారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
ఈ వైద్య శిబిరానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై, వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. సింగరేణి సంస్థ ప్రజల ఆరోగ్య సంక్షేమానికి కట్టుబడి ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ లలిత కుమారి మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని,ఇలాంటి వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రాజెక్టు ఆఫీసర్ నరసింహ రావు మాట్లాడుతూ, ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ లలిత కుమారి, వి.కె.సి.ఎం ప్రాజెక్టు ఆఫీసర్ నరసింహ రావు , వెల్ఫేర్ ఆఫీసర్ విక్టర్ , ఏఐటీయూసీ నాయకులు ఎం.ఆర్.కే ప్రసాద్ , ఐ ఎన్ టి యు సి నాయకులు గోపు కుమార్ ,ఇతర వైద్య సిబ్బంది , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






