9 March, 2026 | 11:46 PM

మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం

09-03-2026 09:39 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో, ఉపాధ్యాయ సంఘాల సమన్వయంతో మండలంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి ఆర్. రాజు గంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను కన్న తల్లిలా ఆదరిస్తూ వారికి నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థుల్లో మంచి విలువలు, విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో రాష్ట్ర పీఆర్టీ అధ్యక్షులు పి. దామోదర్ రెడ్డి, జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడు కుశాల్, మండల ఉపాధ్యాయ సంఘాల నాయకులు అనిల్ కుమార్, శ్రీపాల్ రెడ్డి, ఆర్. మధుసూదన్ రెడ్డి, సుభాన్ రెడ్డి, రాజు, దుబాసి నరేందర్, దుబాసి స్వామి, కుమార్, ఊర్మిళ, అనిత, శైలజ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రసున, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు వందమంది ఉపాధ్యాయులు పాల్గొని మహిళా ఉపాధ్యాయులను సన్మానించి మహిళా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.