దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి సన్మానం
28-03-2026 07:33 PM
దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జీ కం ఫస్ట్ క్లాసు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలలో అధ్యక్షుడిగా విజయం సాధించిన గొంది మురళి మోహన్ ను, కార్యవర్గ సభ్యులను బార్ అసోసియేషన్ కార్యాలయంలో శనివారం దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గొంది మురళీ మోహన్, భార్య లాయర్ సంద్యారాణి లను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, వార్డు సభ్యులు పానుగంటి లక్ష్మణ్ గౌడ్, లాయర్ భవాని కృష్ణ యాదవ్, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లక్కినేని నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.




