17 July, 2026 | 8:36 PM

Breaking News

నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •   యథేచ్ఛగా చెట్ల నరికివేత.. పర్యావరణానికి ముప్పు   •   రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలి   •   గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •   ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం   •  

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌కు సన్మానం

06-03-2026 09:30 PM

సమస్యలు పరిష్కరించాలని విన్నవించిన మున్సిపల్ కార్మికులు

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ ఎం ఆకాష్, వైస్ చైర్మన్ ఎండి అహ్మద్ లను మున్సిపల్ యూనియన్ కార్మిక సంఘం నాయకులు, మున్సిపల్ సిబ్బంది శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి, పూల బొకేలు అందజేసి ఘనంగా సన్మానించారు.

అనంతరం వారు చైర్మన్, వైస్ చైర్మన్‌లతో మాట్లాడుతూ... కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. జీవో నెంబర్ 60 ప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే ఇతర మున్సిపాలిటీల్లో అమలవుతున్న సౌకర్యాలను ఇక్కడ కూడా వర్తింపజేయాలని విన్నవించారు.

దీనిపై చైర్మన్, వైస్ చైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ, కార్మికుల సమస్యలను కౌన్సిల్ సమావేశంలో చర్చించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పెరిక శ్రీకాంత్, అధ్యక్షులు మాట్ల రాజు, కార్యదర్శి తోట సమ్మయ్య, కోశాధికారి బాబురావు, ఉపాధ్యక్షులు సిహెచ్ శంకర్, ప్రభాకర్, సాగర్, ఇస్తారి, సహాయ కార్యదర్శులు సంధ్య, చెన్నూరు లక్ష్మి, బాలేష్, కమిటీ సభ్యులు నారాయణ, జగ్గారావు, అశోక్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.