రెండో రోజూ హోలీ వేడుకలు
05-03-2026 12:58 AM
మహబూబాబాద్/ములుగు/వరంగల్/హనుమకొండ, మార్చి 4 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో హోలీ వేడుకలు రెండో రోజు ఆనందోత్సవాల మధ్య జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా పరస్పరం రంగులు పులువుకొని రంగుల పండుగను కన్నుల పండువగా నిర్వహించుకున్నారు.
పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, జీవితం రంగుల మయం కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం మంగళవారం హోలీ పండుగ సందర్భంగా సెలవు ఇవ్వగా, బుధవారం హోలీ పండుగ పలుచోట్ల ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులు కేరింతల మధ్య నిర్వహించారు.




