28 May, 2026 | 1:28 AM

అధికంగా స్టెరాయిడ్స్ వాడకంతో తుంటి ఎముక సమస్య

28-05-2026 12:36 AM

మేడ్చల్ అర్బన్, మే 27(విజయక్రాంతి): స్టెరాయిడ్స్ అధికంగా వాడడం వల్ల వచ్చే అనర్ధాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్ లోని మెడిసిటి గ్రూప్ ఆఫ్ ఆసుపత్రికి  చెందిన మెడినోవా సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి వైద్యులు సూచించారు. స్టెరాయిడ్స్ తీవ్ర ప్రభావం వల్ల తుంటి భాగం దెబ్బతిని నడవలేని స్థితికి చేరుకున్న రోగికి మెడినోవా వైద్యులు రోగి విజయవంతంగా అందించి తిరిగి నడిపించారు.

హైదరాబాదుకు చెందిన ఉమేష్ సింగ్ (44) గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన నడుము,తుంటి భాగాల నొప్పులతో బాధపడుతున్నట్లు ఆస్పత్రి వైద్యులు చెప్పారు.అంతేకాకుండా కనీసం కూర్చోవడానికి, నడవడానికి తన సాధారణ పనులు చేసుకోవడానికి కుదురక ఆర్థికంగా,శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు.ఆసుపత్రిలో రోగిని పరీక్షించిన ఆర్థోపెడిక్  జాయింట్ రీప్లేస్ మెంట్ వైద్య నిపుణులు డా.యు కార్తిక్ పలు అధునాతన పరీక్షలు  స్కానింగ్ నిర్వహించారు.

వైద్య పరీక్షల్లో రోగి తుంటి భాగానికి చెందిన రెండు హిప్ బోన్ జాయింట్ల లలో రక్త ప్రసరణ తగ్గి ఎముక కుళ్ళిపోయి,అవాస్కులర్ నెక్రోసిస్ సమస్య ఉన్నట్లు నిర్ధారించారు. ఇందులో పూర్తిగా దెబ్బతిన్న ఎడమ హిప్ బోన్ జాయింట్ భాగాన్ని తొలగించి అత్యాధునిక పద్ధతిలో ప్రత్యేకమైన ఇంప్లాంట్ను అమరుస్తూ టోటల్ హిప్ బోన్ శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఆపరేషన్ అనంతరం రోగికి ఐసీయూ పర్యవేక్షణ నొప్పి తెలియకుండా ప్రత్యేక చికిత్స ఫిజియోథెరపీ  పోషకాహార సంరక్షణ అందించారు.

ఈ సందర్భంగా ఆర్థోపెడిక్ నిపుణులు డా.యు కార్తిక్ మాట్లాడుతూ రోగి గతంలో కోవిడ్ మహమ్మారి బారిన పడినప్పుడు ప్రాణాలు కాపాడే క్రమంలో అధిక మొత్తంలో స్టెరాయిడ్స్ వాడినట్లు తెలిసిందని డాక్టర్ స్పష్టం చేశారు.అధిక స్టెరాయిడ్స్ వాడకం వల్లే తుంటి ఎముకలకు రక్తప్రసరణ ఆగిపోయి పరిస్థితి వచ్చిందని ప్రజలు వైద్యుల పర్యవేక్షణ లేకుండా సొంతంగా అవసరానికి మించి స్టెరాయిడ్స్ వాడకూడదని డాక్టర్ కార్తీక్ వెల్లడించారు.