28 May, 2026 | 2:37 AM

10 అంతస్తుల మెట్లెక్కే పోటీ

28-05-2026 12:38 AM

మారథాన్లకు భిన్నంగా నిర్వహించిన స్టార్ హాస్పిటల్స్!

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవాన్ని (గ్లోబల్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే) పురస్కరించుకుని హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్స్ వినూత్నంగా ఎమర్జెనన్’సీ’ 2026 కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా ‘10 అం తస్తుల మెట్లెక్కే పోటీ’ విజయవంతంగా నిర్వహించారు.

సాధారణంగా నిర్వహించే అవే ర్నెస్ వాక్లు లేదా మారథాన్లకు భిన్నంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం. స్టార్ హాస్పిటల్స్కు చెందిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణులతో కలిపి 100 మందికి పైగా పార్టిసిపెంట్స్ ఈ ఛాలెంజ్లో పాల్గొన్నారు.

వీరంతా ఆసుపత్రి భవనంలోని 10 అంతస్తులను ఒకేసారి కాకుండా రెండుసార్లు మొత్తం 20 అంతస్తులు నిలువుగా పైకి ఎక్కి తమ శారీరక దృఢత్వాన్ని నిరూపించుకున్నారు. అత్యంత తక్కువ సమయంలో మెట్లు ఎక్కిన టాప్ 10 విజేతలకు వారి పట్టుదల, దృఢత్వం మరియు సంఘీభావానికి గుర్తింపుగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ గ్రూప్ లీడ్ డాక్టర్ రాహుల్ కట్టా, స్టార్ హాస్పిటల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ రాహుల్ మేడక్కర్ పాల్గొన్నారు.