ఈఆర్‌ఎస్‌ఎస్‌యూ ప్రారంభం
మెడికవర్ ఆస్పత్రిలో ప్రారంభించిన సినీ నటులు జీవిత, రాజశేఖర్
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ యూనిట్లో అత్యాధునిక ఈఆర్‌ఎస్‌ఎస్‌యూను ప్రారంభించింది. అత్యవసర పరిస్థి తుల్లో రోగులకు వేగవంతమైన, సురక్షితమైన, సమర్థవంతమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక యూనిట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ ప్రత్యేక యూనిట్‌ను ప్రముఖ నటీనటులు రాజశేఖర్, జీవిత ప్రారంభించారు. కార్యక్రమంలో డా. సింధూర రెడ్డి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్, డా.దామోదర్ ట్రా మా సర్జన్, డా. హరి కృష్ణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మెడికవర్ హాస్పిటల్స్తో పాటు సీనియర్ వైద్యులు, అత్యవసర వైద్య నిపుణులు, న ర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ టీమ్ మరియు ఆసుపత్రి యాజమాన్యం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా. రాజశేఖర్ మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన వైద్య స్పందన ఎంతో కీలకం. ప్రత్యేక యూనిట్లు రోగులకు మరింత భరో సా, భద్రత కల్పిస్తాయి. మెడికవర్ హాస్పిటల్స్ ఈ తరహా ఆధునిక అత్యవసర వైద్య సేవలను అందించడం అభినందనీయం అని తెలిపారు. డా. సింధూర రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం అత్యవసర కేసుల స్వభావం వేగంగా మారుతోంది.






