30 May, 2026 | 6:19 PM

తాపీ మేస్త్రీలను... దళారులు అనడం దురదృష్టకరం

30-05-2026 05:23 PM

నిర్మాణ రంగ కార్మికులు.. సెంట్రింగ్ కార్మికుల ఐక్యతే భవన నిర్మాణాలకు పునాదులు

బేషరతుగా క్షమాపణ చెప్పాలని భవన నిర్మాణం కార్మిక సంఘం డిమాండ్

జవహర్ నగర్,(విజయక్రాంతి): ఎండనక వాననక పగలు అనక రాత్రి అనక భవన నిర్మాణాల కోసం పనిచేస్తున్న అసంఘటిత కార్మికులైన తాపీ మేస్త్రీలను దళారులు అనడం దురదృష్టకరమైన చర్య అని, భవన నిర్మాణ రంగ కార్మికులు సెంట్రింగ్ కార్మికులు ఐక్యంగా ఉంటేనే భవన నిర్మాణాలు వాటి పునాదులు పటిష్టంగా ఉంటాయని జవహర్ నగర్ భవన నిర్మాణ కార్మిక సంఘం పేర్కొంది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం భవన నిర్మాణ సంఘం మీడియా సమావేశాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవ అధ్యక యాదయ్య మాట్లాడుతూ చిన్న చిన్న మనస్పర్ధలు పక్కనబెట్టి సెంట్రింగ్ మేస్త్రీలు తాపీ మేస్త్రీలు అందరూ కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని అధ్యక్షులు కొయ్యాడ వెంకటేష్ తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు వై. మల్లేష్, గౌరవ అధ్యక్షులు కొయ్యాడవెంకటేష్, నాగునూరి యాదయ్య, సిహెచ్ రమణారెడ్డి, మరాటి బాబు, బూడిద వెంకటేష్, కోట్ల చెన్నారెడ్డి, దుబాయ్ శ్రీను, శ్రీనివాస్, మురళి, శాంతయ్య, ఆర్. రాములు, కావూరి కుమార్, రామస్వామి, మల్లేష్, కొయ్యడ ఐలయ్య, కుమార్, మాధవ్, యాదగిరి, సాదుల్ల, బాబు నరసింహ, మామిడి కొండయ్య, ప్రసాద్, రమేష్, కృష్ణ, నరసింహ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.