20-02-2026 12:56:13 AM
మూడు రోజుల పాటు నోవాటెల్‌లో నిర్వహణ
హైదరాబాద్, ఫిబ్రవరి 19(విజయక్రాం తి) : హైదరాబాద్ నగరం మరొక్కసారి ‘హై లైఫ్ ఎగ్జిబిషన్’ ద్వారా సరికొత్త విలాసవంతమైన, అద్భుతమైన ఫ్యాషన్ ప్రపంచానికి స్వాగతం పలుకుతోంది. అత్యుత్తమ డిజైనర్ దుస్తులు, అద్భుతమైన ఆభరణాలు, ప్రీమి యం లైఫ్ స్టైల్ కలెక్షన్లను ఇక్కడ ప్రదర్శించబోతోంది.
నైపుణ్యం, శైలి, ఆధునిక హుందాతనాన్ని ఒకే చోట చేర్చి, ప్రత్యేకతను కోరుకునే ఫ్యాషన్ ప్రేమికుల కోసం ఇది ఒక సరైన తప్పక సందర్శించాల్సిన వేదిక. ఈ అ ద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకోవడానికి రేపటి నుంచి మూడు రోజులపాటు అనగా ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు హైదరాబాద్ లోని నోవాటెల్ హెచ్‌ఐసీసీలో జరిగే ఎగ్జిబిషన్‌కు విచ్చేయాలని ముఖ్యంగా ఫ్యాషన్ ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.