19 June, 2026 | 1:36 PM

Breaking News

ఫాస్ట్ ఫుడ్ లవర్స్ జర భద్రం... గోదాంలో దొరికిన రంగులు, కుళ్లిన చికెన్

19-06-2026 12:09 PM

చార్మినార్‌లో కల్తీ ఫాస్ట్ ఫుడ్ గోడౌన్‌పై H-FAST మెరుపు దాడులు

హైదరాబాద్: చార్మినార్ హుస్సేనియాలం పోలీస్ స్టేషన్(Hussainialam Police Station) పరిధిలోని న్యూ లాడ్ బజార్‌లో ‘అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్’ గోదాంపై హెచ్-ఫాస్ట్ (H-FAST) అధికారులు శుక్రవారం మెరుపు దాడి చేశారు. లైసెన్స్ లేకుండా అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల్లో ఫాస్ట్ ఫుడ్(fast food), ఇతర పదార్థాలు తయారు చేస్తున్న గోదాంలో దాడులు చేసి 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల కల్తీ నూనె స్వాధీనం చేసుకున్నారు. ఆహారంలో నిషేధిత పదార్థాలు, రంగులు వాడుతున్నట్లు గుర్తించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న ఇద్దరు నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ ఆహారంపై 8712661212 నంబర్ కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలు

 FSSAI లైసెన్స్ లేదు, అత్యంత అపరిశుభ్ర వాతావరణం.

 క్యాన్సర్‌కు కారణమయ్యే నిషేధిత కృత్రిమ రంగుల వాడకం.

 వాడిన వంట నూనెనే పదే పదే వాడుతూ వంటలు.

స్వాధీనం చేసుకున్న వివరాలు

• సుమారు 110 కిలోల సిద్ధం చేసిన ఫ్రైడ్ చికెన్.

• 6 టిన్ల వంట నూనె (ఒక్కొక్కటి 15 లీటర్లు).

• కృత్రిమ రసాయన ఆహార రంగులు.