హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్ గ్రాండ్ లాంచ్
ప్రత్యేక ఫ్యాషన్, ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ ఎగ్జిబిషన్
హైదరాబాద్, మార్చి 21(విజయక్రాంతి): అతిపెద్ద ఎగ్జిబిషన్ బ్రాండ్, అత్యంత ప్రియమైన ఎగ్జిబిషన్ ‘హాయ్ లైఫ్’ ఎగ్జిబిషన్ శుక్ర వారం హెచ్‌ఐసీసీ నోవొటెల్ హోటల్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్బం గా నిర్వాహకులు పలు మోడల్స్‌తో పలు రకాల వెరైటీ డిజైన్స్ కలిగిన ఫ్యాషన్ వేర్ అండ్ జ్యువలరీ వేర్ తో షో ఏర్పాటు చేసి ప్రదర్శించారు. ఈ గ్రాండ్ లాంచ్ కార్యక్రమానికి నటి రిథు చౌదరి, నటి శ్రావంతి చోక్కారపు, ఫ్యాషన్ ప్రేమికులు, ఫ్యాషన్ అభిమానులు హాజరై ఎగ్జిబిషన్‌ను ఘనం గా ప్రారంభించారు.
మొదటి రోజే పెద్ద సం ఖ్యలో ఫాషన్ ప్రియులు పాల్గొని వారికి కా వాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 23 వరకు కొనసాగుతుందని ఇంకా రెండు రోజుల పాటు జరిగే ‘హా య్ లైఫ్’ ఎగ్జిబిషన్ ను సందర్శించి మీకు కావాల్సిన ప్రత్యేకమైన ఆభరణాలు, ఫ్యాష న్ అండ్ లైఫ్‌స్టయిల్స్‌కు సంబందించిన పలు విభిన్న రకాల వస్తువులను కొనుగోలు చేయవలసిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.
ఈ సందర్భంగా ‘హాయ్ లైఫ్’ ఎగ్జిబిషన్ ఎండీ అండ్ సీఈఓ,హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్స్ అండ్ చీఫ్ ఆర్గనైజర్ పి. ఏబై డొమినిక్ మా ట్లాడుతూ ‘హాయ్ లైఫ్’అనేది అతిపెద్ద జ్యువెలరీ, వెడ్డింగ్, ఫ్యాషన్, ఫెస్టివ్ అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్ట్రావాగాంజాలో ఒకటి, ఇది ఫిబ్రవరి 21, 22, 23, తేదీల్లో హైదరాబాద్‌లోని నోవోటెల్లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించాం. ‘హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్’లో ఆభరణాలు, బ్రైడల్ ఫ్యా షన్లు, డిజైనర్ ఫ్యాషన్లు, మరిన్నింటి ప్రత్యేకమైన ప్రదర్శనను కలిగి ఉంటుంది. హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్‌లో డిజైనర్ చీరలు, ఫ్యాషన్ వేర్ అండ్ లైఫ్ స్టైల్ కలెక్షన్లు లేటెస్ట్ ఫ్యాషన్ డిజైనర్స్ కలెక్షన్స్, జ్యువెలరీ, వెడ్డింగ్, జ్యువెలరీ, ఫ్యాషన్ లేబుల్స్ మరిన్ని ఉన్నాయి.




