అచ్చయపల్లి గ్రామంలో పిచ్చి మొక్కలకు గడ్డి మందు పిచికారీ
15-08-2026 12:24 AM
నాగిరెడ్డిపేట్,ఆగస్టు 14 (విజయ క్రాంతి) : మండలంలోని అచ్చయపల్లి గ్రామంలో గడ్డి మందు పిచికారి చేసినట్లు గ్రామ సర్పంచ్ బెస్త సాయిలు తెలిపారు. వర్షాకాలం సందర్భంగా గ్రామస్తులకు చీడ పురుగులు, ఈగలు దోమలు సోకకుండా గడ్డి మందు పిచికారి చేసినట్లు గ్రామ సర్పంచ్ బెస్త సాయిలు తెలిపారు.
గ్రామంలోని వీధుల గుండా మురికి కాలువల వెంబడి వివిధ పరిసరాలలో పిచ్చి మొక్కలు ఉండడంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గడ్డి మందు పిచికారి చేసినట్లు గ్రామ సర్పంచి బెస్త సాయిలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెస్త సాయిలు గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకట్ రాములు,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రజినీకాంత్ తదితరులు ఉన్నారు.






