15 August, 2026 | 4:37 AM

ఐక్యతకు ప్రతీక.. హర్ ఘర్ తిరంగా

15-08-2026 12:23 AM

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి 

చేవెళ్ల ఆగష్టు 14(విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలో బీజేపీ చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్ రెడ్డి, బీజేపీ చేవెళ్ల మండల అధ్యక్షుడు మున్నూరి శ్రీకాం త్ ఆధ్వర్యంలో జరిగిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పాల్గొన్నారు. దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటిచెప్పే ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యక ర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాల ప్రదర్శించి దేశభక్తిని చాటారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. స్వాతం త్య్రం గౌరవం ఐక్యతకు ప్రతీక అన్నారు. స్వా తంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరి స్తూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేసి దేశభక్తిని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చా రు. యువత దేశ భవిష్యత్తుకు వెన్నెముక అ ని, విద్యార్ధి దశ నుంచే క్రమశిక్షణ దేశభక్తి, జాతీయ భావం పెంచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ప్రకాష్, ప్రభాకర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, బీజేఎం నాయకులు వైభవ్ రెడ్డి, మమతా మోహన్ రెడ్డి, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.