9 నుంచే హెలీ టూరిజం సేవలు
- సోమశిల, శ్రీశైలం క్షేత్రాల మధ్య హెలికాఫ్టర్ యాత్ర
- తెలంగాణను అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం
- మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూల్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): కృష్ణమ్మ పరవళ్లు.. నల్లమల ప్రకృతి అందాలను ఆకాశ మార్గం నుంచి వీక్షించే అద్భుత అవకాశం పర్యాటకులకు చేరువ చేసేలా ఈ నెల 9 నుంచే హెలీ టూరిజం సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం కొల్లాపూర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో మంత్రి మాట్లాడారు.
పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ సోమశిల, -శ్రీశైలం క్షేత్రాల మధ్య ‘హేలీ టూరిజం’ సేవలను ఈ నెల 9న ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ హెలికాప్టర్ యాత్ర సోమశిల మీదుగా శ్రీశైలం వరకు సాగుతుందని మం త్రి వివరించారు. సోమశిల చేరుకున్న పర్యాటకులు కృష్ణానదిలో బోటింగ్ చేస్తూ ప్రకృ తిని ఆస్వాదించవచ్చని, అనంతరం శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చని తెలిపారు.
ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని మం త్రి వివరించారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో ఈ సేవలను కేవలం సోమశిలకే పరిమితం చేయ కుండా నాగార్జున సాగర్, రామప్ప, నిజాం సాగర్ వంటి ప్రముఖ పర్యాటక కేంద్రాలకు కూడా విస్తరిస్తామని, తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.




