3 September, 2026 | 6:46 PM

పోయిన మొబైల్‌ను బాధితుడికి అప్పగించిన పోలీసులు

03-09-2026 | 05:30pm

గణపురం,(విజయక్రాంతి): గణపురం  పోలీస్‌స్టేషన్(Ganapuram Police Station) పరిధిలోని బుర్రకాయలగూడెం గ్రామానికి చెందిన కాలియా సాగర్ మొబైల్ ఫోన్ పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేంద్ర పరికరాల గుర్తింపు నమోదు పోర్టల్‌ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని(Technology) ఉపయోగించి మొబైల్‌ ఫోన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

గుర్తించిన మొబైల్‌ ఫోన్‌ను గురువారం కలియా సాగర్‌కు గణపురం ఎస్ఐ బొరగల అశోక్ పోలీస్ స్టేషన్ లో అందజేశారు. పోయిన లేదా దొంగిలించబడిన మొబైల్‌ ఫోన్లను తిరిగి పొందడంలో కేంద్ర పరికరాల గుర్తింపు నమోదు పోర్టల్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎస్ ఐ తెలిపారు. ప్రజలు తమ మొబైల్‌ ఫోన్‌ పోయిన వెంటనే ఈ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలని సూచించారు.