3 September, 2026 | 7:29 PM

వరి ఫౌండేషన్ సీడ్ క్షేత్రాల పరిశీలన

03-09-2026 | 05:48pm

టేకులపల్లి,(విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం(Professor Jayashankar Telangana Agricultural University), నాబార్డ్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫౌండేషన్ సీడ్ విత్తన ఉత్పత్తి కార్యక్రమం(Foundation Seed Seed Production Program)లో భాగంగా టేకులపల్లి మండలం(Tekulapalli Mandal)లోని గంగాపురం, ప్రగళ్లపాడు గ్రామాల్లో సాగుచేస్తున్న వరి ఫౌండేషన్ సీడ్ (బీపీటీ–5204) క్షేత్రాలను అధికారులు పరిశీలించారు. కృషి విజ్ఞాన కేంద్రం(Krishi Knowledge Center), భద్రాద్రి కొత్తగూడెం సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ టి. భరత్, బేతంపూడి పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్, సీఈఓ ప్రేమాచారి క్షేత్రాలను సందర్శించి వరి పంట పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ టి. భరత్ మాట్లాడుతూ రైతు స్థాయిలో నాణ్యమైన విత్తన ఉత్పత్తి చేపట్టడం ద్వారా ఆయా మండలాల రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రైతులు విత్తన ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించి, శాస్త్రీయ పద్ధతులను పాటించాలని సూచించారు.