పరిశుభ్రతకు నిలయం పోలీస్ టానా
03-09-2026 | 06:07pm
సదాశివ నగర్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్(Police station) పచ్చదనానికి పరిశుభ్రతకు నిలయంగా మారింది. నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసులు పచ్చదనాన్ని, పరిశుభ్రతను కాపాడేందుకు తమదైన శైలిలో పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. నిత్యం ఫిర్యాదుదారులతో బిజీగా ఉండే పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ పర్యావరణ పరిరక్షణ(environmental protection)లో భాగస్వామ్యం అవుతున్నారు.






