బిఆర్టియు ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా
ముకరంపుర,(విజయక్రాంతి): సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ కలెక్టరేట్(Karimnagar Collectorate) ఎదురుగా బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి(BRTU District President Bommidi Srinivas Reddy) ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. హమాలి, భవన నిర్మాణ కార్మికుల(Porters and construction workers) పక్షాన వారి సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ఎదురుగా గురువారం శ్రీనివాస్ రెడ్డి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. మాట్లాడుతూ కార్మికులకు ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయలను ఎల్ఐసి ద్వారా కాకుండా బీఓసీ(BOC) ద్వారా ఇవ్వాలని 55 సంవత్సరాలు దాటిన కార్మికులకు బీఓసీ బోర్డు ద్వారా 5వేల రూపాయల పెన్షన్(Pension) ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగె వెంటనే హమాలి కార్మికులకు ఐకెపి సెంటర్ల లో పనిచేసే వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మరియు హమాలి రంగం కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు మరియు హమాలి కార్మికులు పాల్గొన్నారు.






