19 May, 2026 | 11:16 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

తొర్రూర్ లో భారీ బందోబస్తు

17-02-2026 12:17 PM

హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) తొర్రూరు మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా మంగళవారం భారీగా పోలీసులు మోహరించారు. సోమవారం జరిగిన అవాంఛనీయ ఘటన నేపథ్యంలో వాయిదా పడ్డ ఎన్నికలు మంగళవారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో 144వ సెక్షన్ విధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. నిన్నటి ఘర్షణల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్ అయ్యారు. సత్యవతి రాథోడ్, మధుసూదనాచారి, రవిచంద్ర హౌస్ అరెస్ట్ అయ్యారు.