1 July, 2026 | 8:13 PM

Breaking News

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •  

తెలంగాణకు ప్రజలకు హెచ్చరిక.. ఎల్లుండి నుంచి భానుడి భగభగలు

14-04-2026 03:12 PM

మండుతున్న ఎండలు, భానుడి భగభగలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. రాష్ట్రంలో 42 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఉమ్మడి నిజామాబాద్ లో 42.4, ఆదిలాబాద్ లో 42.3, ఉమ్మడి మహబూబ్ నగర్ లో 41, ఖమ్మంలో 40.4, ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఎల్లుండి నుంచి మరింత ఎండలు ఠారెత్తించనున్నాయి. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు(Heat Wave Alert) వీచే అవకాశం ఉంది. ఎల్లుండి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.