పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి
ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి
మునిపల్లి,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణలోప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, మండల స్పెషలాఫీర్ రామాచారి పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మండలంలోని పెద్దగోపులారం గ్రామంలో గ్రామ సర్పంచ్ మల్లేశం, మాజీ ఎంపీటీసీ పాండుతో కలిసి ఆయన మొక్కలునాట నీరు పోశారు. ఈ సందర్భంగా రామాచారి మాట్లాడుతూ... వాతావరణ సముతుల్యత కోసం మొక్కలు నాటాలని, అవి చెట్లుగా మారి మానవ జీవన మనుగడకు పనిచేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేశం, మాజీ ఎంపీటీసీ బుర్కల పాండు, ఎంపీడీఓ కార్యాలయ సూపరిండెంట్ రామలింగం, ఎంపీఓ క్రిష్ణ కుమార్, ఏపీఓ యాదగిరి, టీఏ పవన్, వార్డు సభ్యులు తదితరులుపాల్గొన్నారు.






