4 March, 2026 | 11:33 PM

పెద్దపల్లి జిల్లాతో హెచ్‌సిసిబి ఒప్పందం

04-03-2026 09:58 PM

మార్చి 3, పెద్దపల్లి: భారతదేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందూస్తాన్ కోకా-కోలా బేవరేజెస్ (హెచ్‌సిసిబి ) సిఎస్ఆర్ కార్యాచరణ కార్యక్రమం ప్రాజెక్ట్ షైన్ కింద ఉమ్మడి కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్రం,  పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ పరిపాలన యంత్రాంగంతో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది. తెలంగాణ రాష్ట్రం , పెద్దపల్లి జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ కోయ శ్రీ హర్ష, ఐ.ఏ.ఎస్. మరియు హెచ్‌సిసిబి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) హెడ్ శ్వేతా పునీత,  సీనియర్ అధికారులు మరియు కమ్యూనిటీ వాటాదారుల సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ అవగాహన ఒప్పందం ప్రకారం, పెద్దపల్లిలో ప్రభుత్వ అభివృద్ధి ప్రాధాన్యతలకు అనుగుణంగా సిఎస్ఆర్ కార్యక్రమాలను హెచ్‌సిసిబి  ప్రణాళిక చేయటం, సహ రూపకల్పన చేయటం తో పాటుగా అమలు చేస్తుంది. ఈ కార్యక్రమాలలో భాగంగా  నీటి శుద్ధి యూనిట్‌ను అందించడం, పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు ముత్తారం, రామగిరి, మంథని ప్రాంతాలలోని పాఠశాలలు మరియు సమాజాలలో ఆరోగ్యం , నీటి సంరక్షణ, పారిశుధ్యం మరియు పరిశుభ్రత (వాష్) అవగాహన సదస్సులను నిర్వహించడం వంటి గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి.

ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా, చెరువుల  సుందరీకరణ కార్యకలాపాలకు కూడా  హెచ్‌సిసిబి మద్దతు ఇస్తుంది. స్థానిక నీటి మౌలిక సదుపాయాలలో ఒక శక్తివంతమైన కమ్యూనిటీ స్థలంగా దానిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అదనంగా, అర్హతగల ప్రజలు సంబంధిత రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలను పొందడంలో సహాయపడటానికి నాగరిక్ సూచ్న కేంద్రాలను (ఎన్ఎస్ కె లు) విస్తరిస్తుంది.

ఈ భాగస్వామ్యం స్వయం సహాయక బృందాల (ఎస్ హెచ్ జి లు) ద్వారా మహిళలకు  నైపుణ్య అభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత , జీవనోపాధి అవకాశాలపై మరింత దృష్టి పెడుతుంది. పెద్దపల్లిలో, స్థిరమైన గ్రామీణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం, ప్రభుత్వ  రంగ సంస్థలను బలోపేతం చేయడం, స్థానిక వ్యవస్థాపకతను ప్రోత్సహించటం  తమ ప్రాధాన్యతగా ఉందని

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ,జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ కోయ శ్రీ హర్ష చెప్పారు. కాగా ప్రాజెక్ట్ షైన్ ద్వారా కీలకమైన మౌలిక సదుపాయాలు, వాష్ యాక్సెస్, మహిళా వ్యవస్థాపకత  విద్యపై దృష్టి సారించడం సంతోషంగా ఉందని హెచ్‌సిసిబి చీఫ్ పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ & సస్టైనబిలిటీ ఆఫీసర్ హిమాన్షు ప్రియదర్శి చెప్పారు.