25 July, 2026 | 5:25 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

నంగునూరులో ఈదురు గాలుల బీభత్సం

18-03-2026 12:00 AM
  1. నేలకొరిగిన మొక్కజొన్న

క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎడిఏ పద్మ 

నంగునూరు, మార్చి 17:నంగునూరు మండలంలో సోమవారం సాయంత్రం వీచిన భారీ ఈదురు గాలులు అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి.కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంట పూర్తిగా నేలవాలడంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నా రు. మొక్కజొన్నతో పాటు పలు గ్రామాల్లో మామిడి తోటల్లో పిందెలు, కాయలు రాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది.

మంగళవా రం ఏడీఏ పద్మ, ఏఓ గీతతో కలిసి గట్లమల్యాల,అక్కెనపల్లి గ్రామాల్లో దెబ్బతిన్న పంట లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.గట్లమల్యాలలో 1100 ఎకరాలు, అక్కెనపల్లిలో 40 0 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారన్నారు. నష్టపోయిన ప్రతి రైతు వివరాలను కూడా నమోదు చేయాలని ఏఈఓలను ఆదేశించారు.ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమ ర్పించి బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. 

రైతులకు భరోసా కల్పించిన మాజీ ప్రజాప్రతినిధులు

ఈదురు గాలులకు పంటలు నష్టపోయి న విషయం తెలుసుకొన్న మాజీ ఎంపీపీ జా ప శ్రీకాంత్ రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ కోల రమేష్ గౌడ్ గ్రామాల వారీగా పర్యటించి పంటలను పరిశీలించారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు వెంటనే నష్టప రిహారం అందేలా చర్యలు చేపట్టాలని వారు అధికారులను కోరారు. పంట నష్టం వివరాలను స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు పరిహారం అందేలా తమ వంతు కృషి చేస్తామని రైతులకు భరో సా ఇచ్చారు.అధికారుల వెంట సర్పంచులు నరేష్, సరోజన,రమేష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్,రైతులు ఉన్నారు.