సెలెక్ట్ కమిటీకి ‘హేట్ స్పీచ్’ బిల్లు
- ద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నూతన బిల్లు
- అసెంబ్లీలో సభ్యుల భిన్నాభిప్రాయాలు
హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా సాగుతున్న ద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందు కు సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం నూతన బిల్లును ప్రతిపాదించింది. ఈ బిల్లుపై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో, ప్రభుత్వం ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేస్తూ తీర్మానం చేసింది.
సోషల్ మీడియా, బహిరంగ సభల్లో కొందరు వ్యక్తులు మతపరమైన, కులపరమైన విద్వేషాలను రెచ్చగొడుతున్న నేపథ్యంలో, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభు త్వం ఈ ప్రత్యేక బిల్లును రూపొందించింది. ద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారికి భారీ జరిమానాతో పాటు, నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద జైలు శిక్ష విధించేలా ఇందులో ప్రతిపాదనలు ఉన్నాయి.
అంతేకాదు.. ఇంటర్నెట్ వేది కగా అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని గుర్తించేందుకు పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులతో పాటు కొందరు అధికార పార్టీ సభ్యులు కూడా ఆందోళనలు వ్యక్తం చేశారు. ద్వేషపూరిత ప్రసంగం అనే పదానికి స్పష్టమైన నిర్వచనం లేకపోతే, పోలీసులు రాజకీయ కక్షసాధింపులకు వాడుకునే ప్రమా దం ఉందని అభిప్రాయపడ్డారు.
సభ్యుల సూ చనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఈ బిల్లుపై సమగ్రంగా చర్చించడం మంచిదని భావించింది. ఈ మేరకు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు సభలో తీర్మానం ప్రవేశపె ట్టారు. కమిటీ నివేదిక సమర్పించిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.




