22-02-2026 05:29:03 PM
హైదరాబాద్: మూసీ సుందరీకరణ కాదని ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీ అని బీఆర్ఎస్ మజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సీఎం వేసే ప్రతి అడుగు వెనుకా భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారమే అని, పేదల ఇళ్లు కూల్చి.. బడాబాబులకు భూములు కట్టబెట్టే కుట్ర అని రేవంత్ రెడ్డి తెలిపారు. మంచి నీళ్లు ఇచ్చి పేదల బతుకులను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నిలబెట్టారని గుర్తు చేశారు.
బుల్‌డోజర్లు పెట్టి పేదల జీవితాలను రేవంత్ రెడ్డి కూలగొడుతున్నారని, డీపీఆర్ లేదు, ఎఫ్టీఎల్ తేలలేదు, అనుమతులు లేవని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఏ చట్టం ప్రాకారం ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తున్నారని, మధు పార్క్ అపార్ట్ మెంట్ కు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలన్నారు. బాధితుల పక్షాన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీష్ రావు చెప్పారు.